రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో సందడి చేయనున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచిన ‘లైగర్’ టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా