telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 వ్యాఖ్యాతగా స్టార్ హీరోయిన్ ?

Samantha

సమంతకు రెండు తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ కూడా మాములుగా ఉండదు. పెళ్లి తర్వాత కుడా సమంత సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.అయితే ఇప్పుడు అనూహ్యంగా బిగ్ బాస్ 4 ను కోడలు అక్కినేని సమంత హోస్ట్ చేయబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ చేసిన మొదటి లేడీగా సమంత నిలుస్తుంది. ఇంతకు ముందు రమ్యకృష్ణ చేసింది కానీ పూర్తి సీజన్ చెయ్యలేదు. మన తెలుగు బిగ్ బాస్ లో మొత్తం మూడు సీజన్లు పూర్తయ్యాయి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సెకండ్ సీజన్ ను నాని హోస్ట్ చేశారు. కాగా, మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ ను ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనే విషయంపై ఆసక్తి మొదలైంది. వచ్చే సీజన్లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయబోతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి లేదు మళ్ళీ నాగార్జునే బిగ్ బాస్ 4 హోస్ట్ అని అన్నారు. ఇప్పుడు సమంత పేరు విన్పిస్తోంది. మరేం జరగనుందో చూడాలి.

Related posts