telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

టీఆర్పీ స్కామ్ లో రిపబ్లిక్ టీవీ సీఈఓ కోర్టుకి…

టీఆర్‌పీ స్కామ్‌లో రిపబ్లిక్ టీవీ ఛానెల్ సీఈఓ వికాస్ ఖాన్‌చందన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతడిని ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. టీఆర్‌పీ స్కామ్‌లో ఇది పదమూడవ అరెస్ట్. అయితే ఇటీవల ముంబై పోలీసులు చానళ్ల టీఆర్‌పీ స్కామ్ కేసు విచారణలో  ఇప్పటి వరకు 13మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ప్రముఖ టీవీ చానల్ రిపబ్లిక్ సీఈఓ కూడా ఉన్నారు. దీనిని జాయింట్ కమిషనద్ ఆఫ్ పోలీస్ మిలింద్ భరంభే తెలిపారు. అతడు ఇప్పటికే రెండు ప్రశ్నించపబడ్డాని, ఈ రోజు అతడిని కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. అయితే హంసా రీసెర్చ్ గ్రూప్ ద్వారా కొన్ని చానళ్లు టీఆర్‌పీ పెంచేందుకు అనదికారిక దారులలో వెళుతుందని బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్‌సీ)లో ఫార్యాదు చేశయడంతో పోలీసులు దీనిపై విచారణ మొదలు పెట్టారు. టీఆర్‌పీ స్కామ్ అంటే ఒకే చానల్‌ను ఎల్‌సీఎన్ అనే పద్దతి ద్వారా ఇద్దరు చూస్తున్నట్లు చేయవచ్చు దానినినే టీఆర్‌పీ స్కామ్ అంటారు. ఈ స్కామ్ చేసి ఎందరినో ప్రకటనలు ఇచ్చే విధంగా ఆకర్షించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తాన్ని అర్జిస్తారు. ఈ విచారణను జరిపిన బీఏఆర్‌సీ వారు రిపబ్లిక్ చానల్ సీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అతడిని నేడు కోర్టులో హాజరు చేయనున్నారు.

Related posts