మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రలో మాత్రం కేసులు తగ్గుతున్నాయి. కానీ కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి దశలో కేసులను అరికట్టినా, ఓనం పండుగ తరువాత కేసుల సంఖ్య పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం రోజున ఆ రాష్ట్రంలో 5,949 కేసులు నమోదయ్యాయి. వచ్చే నెల నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, ఫైజర్ వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటితో పాటుగా దేశంలో మరో ఐదు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇకపోతే, కరోనా కేసులను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని అందరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. దేశంలోని ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామని, కేంద్రం ఎన్ని వ్యాక్సిన్లు అందిస్తుందో తెలియదని అయన పేర్కొన్నారు. చూడాలి మరి ఆ వ్యాక్సిన్ ఇప్పటివరకు వస్తుంది అనేది
previous post
next post
బాలకృష్ణ హీరో… ఆయనంటే ప్రత్యేక గౌరవం… : నాగబాబు