telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

5 రూపాయలు పెరిగిన .. వంట గ్యాస్ ధరలు ..

cooking gas cylinder rates decreased by govt

మరోసారి వంట గ్యాస్ ధరలు సవరించారు. దీనితో మళ్లీ వంటగ్యాస్ ధరలు పెరిగాయి. రాయితీ లేని వంటగ్యాస్ ధర, విమాన ఇంధన ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) ధరను కిలో లీటర్ కు రూ. 677.10 పెంచారు. దీనితో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర రూ. 63,472.22 కు చేరింది.

ఇదే సమయంలో 14.2 కిలోల బరువుండే నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 5 పెంచుతున్నట్టు ఓఎంసీలు తెలిపాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 706.50కి (సబ్సిడీ రహిత) చేరింది. ప్రస్తుతం ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ పరిమితి దాటితే, అధికంగా వెచ్చిస్తూ, మార్కెట్ ధరకు సిలిండర్ ను కొనుగోలు చేయాల్సి వుంటుంది.a

Related posts