telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మాస్ మహారాజ్ క్రాక్ పాట వచ్చేసింది…!

KRack

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న రవితేజకు చాలా రోజులుగా సారన్నా హిట్ లేదు.
అయితే ప్రస్తుతం రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా పైనే తన ఆశాలు అన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో శ్రుతి హాసన్ రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపింమచనున్నాడు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. దీనిని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై బీ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం ఇటీవల దుబాచ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాయారం ప్రకారం ఈ సినిమా నుంచి ఓ పాట టీజర్ నేడు విడుదలైంది. ఈ సినిమాను సంక్రాంతి పోదులో నిలబెట్టనున్నారు. ఈ సినిమా నుంచి నేడు భలేగా ఉన్నవే బంగారం అంటూ మాస్ పిచ్‌లో ఉందీ పాట. ఈ పాట పూర్తి వెర్షన్ విడుదలైతే ఎనర్జిటిగ్ పాటగా కచ్చితంగి పేరు తెచ్చకుంటుందని అభిమానులు అంటున్నారు. ఈ పాటకు సంగీతం తమన్ అందించగా వోకల్స్ మాత్రం అనిరుద్ ఇచ్చాడు. ఇద్దరు టాప్ మ్యూజిషియన్స్ కష్టపడి చేయడంతో పాట కూడా అంతే అద్భుతంగా వచ్చింది. అంతేకాకుండా ఈ పాట మంచి స్పందనను అందుకుంది. ఇక సినిమా విడుదలైతే ఈ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఉవ్విలూరుతున్నారు.

Related posts