ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.82 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండేవి. కానీ, ఇప్పుడు కేసులు వందలకు వరకు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,82,542 కు చేరింది. ఇందులో 8,73,026 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,382 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,134 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 231 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
previous post
దేశంలో ఒకే భాష ఉండాలి… అప్పుడే విదేశీ భాషలకు చోటుండదు: అమిత్ షా