telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్”లో స్నేహ ఉల్లాల్…!

Sneha

న‌వ‌ర‌సాల‌ను ఒలికిస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకునేందుకు బిగ్‌బాస్ హిందీ 14వ సీజ‌న్‌ సిద్ధం అవుతోంది. ఈసారి కూడా స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఆయ‌న‌పై ముంబైలోని మెహ‌బూబ్ స్టూడియోలో ఇదివ‌ర‌కే ప్రోమో చిత్రీక‌రించారు. దీన్ని ఆగ‌స్టు 15న రిలీజ్ చేయ‌నున్నారు. సెప్టెంబ‌ర్‌లో మొద‌లు కానున్న ఈ షోలో ఈసారి ఎవ‌రెవ‌రు పాల్గొంటార‌నేదానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఎప్ప‌టిలాగానే ఈసారి కూడా టీవీ నటీనటులు విశాల్ ర‌హేజా, డోనాల్ బిష్త్‌, షలీన్ భ‌నోత్‌, షిరాన్ మిర్జా, నియా శ‌ర్మ‌, జాస్మిన్ భాసిన్వి వియాన్ సేన‌, సంగీతా ఘోష్‌, అలీషా ప‌న్వార్‌, జై సోని, షాగున్ పాండే పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. వీరితో పాటు “ఉల్లాసంగా ఉత్సాహంగా” హీరోయిన్ స్నేహా ఉల్లాల్ కూడా బిగ్‌బాస్‌లో అడుగు పెట్ట‌నున్న‌ట్లు వినికిడి.

Related posts