telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెండితెరపై అమృత, మారుతీ రావుల కథ… “మర్డర్” ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ

Murder

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం అయింది ప్రణయ్ హత్య. భార్య (అమృత) ముందే అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు ప్రణయ్. ఈ హత్యకు ప్రధాన సూత్రదారిగా అయిన అమృత తండ్రి మారుతీ రావుపై కేసు నమోదైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనను కాదని ప్రేమ వివాహాం చేసుకోవడంతో అమృత కళ్ళముందే అల్లుడు ప్రణయ్‌ని మారుతీరావు హతమార్చారని విన్నాం. ఇంతలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ తండ్రీ కూతుళ్ళ ఇష్యూ జనాల్లో పలు చర్చలకు దారి తీసింది.

ఈ రియల్ స్టోరీనే కథాంశంగా తీసుకొని కొత్త సినిమా రూపొందిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీకి MURDER అనే టైటిల్ ఫిక్స్ చేసి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు వర్మ. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ”ఓ తండ్రి తన కుమార్తెను అమితమైన ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్‌ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను లాంచ్‌ చేస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయింది.

Related posts