telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

డెల్టా స్ట్రెయిన్‌ ఎంత ప్రమాదకరమంటే !

ఇతర వైరస్‌ రకాలతో పోలిస్తే డెల్టా వేరియెంట్‌ చాలా ఆందోళన కలిగిస్తోంది. సార్స్‌–కోవి–2 డెల్టా వేరియంట్‌కి . ఈరోజువరకు బయటపడిన కరోనా వైరస్‌ రకాల్లో ఈ డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా మారడానికి రెండు కారణాలున్నాయి.. వైరస్‌ ఒరిజనల్‌ రకంతో పోలిస్తే ఇది 50 శాతం అధికంగా పరివర్తన చెందుతున్నట్లు కనుగొన్నారు. ఏప్రిల్‌ ప్రారంభంలో ఒక్క శాతం మాత్రమే డెల్టా వేరియంట్‌ కేసుల. ఇలాగే విస్తరిస్తే జూన్‌ చివరినాటికి ఇది అల్పా వేరియంట్‌ స్థానాన్ని పూర్తిగా ఆక్రమిస్తుందని చెబుతున్నారు. రెండు, ఇది అల్ఫా వైరస్‌ రకం కంటే ప్రమాదకరమైనదని భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో చేర్చవలసిన పాజిటివ్‌ కేసుల శాతాన్ని ఈ వైరస్‌ రకం అమాంతంగా పెంచేస్తోంది. పైగా ఈ వైరస్‌ రకం ఇన్ఫెక్షన్లు ప్రధానంగా యువతలో అధికంగా ఏర్పడుతున్నాయి. ఇది మరింత తీవ్రంగా విస్తరిస్తోంది.

 

#డెల్టా_వేరియంట్‌_వ్యాక్సిన్లకు_ప్రభావితం_అవుతుందా_అంటే_సమాధానం_క్లిష్టమే.

        . ఈ రకమైన రక్షణ అల్పా, బీటా వేరియంట్లలో చాలా తక్కువ. జనాభాలో ఎక్కువమంది వ్యాక్సిన్‌ ఇంకా తీసుకోనప్పుడు, లేదా ఇంతవరకు ఒక డోస్‌ మాత్రమే తీసుకున్నప్పుడు డెల్టా వేరియంట్‌ కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

 

               ఈ వైరస్‌ రకం ఇప్పటికే కనిపించిన దేశాలు దీని నివారణకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వ్యాక్సిన్‌ను వీలైనంత ఎక్కువమందికి అందించడం, అదే సమయంలో పరీక్షలు, జన్యుపరమైన నిఘాను పెంచడాన్ని కూడా రెట్టింపు చేయాలి. మొత్తం జనాభాలో సగంమందికి వ్యాక్సిన్‌ ఇప్పించిన ఇజ్రాయెల్‌ డెల్టా వేరియంట్‌ని కూడా బాగానే అదుపు చేయగలిగింది. అయితే ఇంతవరకు జనాభాలో 42.3 శాతం మందికి టీకా వేయించిన బ్రిటన్‌లో ముందుగానే లాక్‌డౌన్‌ సడలించడం, డెల్టా వేరియంట్‌ వ్యాప్తి కావడంతో కేసులు అధికమవుతున్నాయి. అమెరికాలో కూడా యూకే తరహాలోనే వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతుండటంతో అక్కడా డెల్టా వేరియంట్‌ ప్రమాదం పొంచుకుని ఉంది.

 

ఇంతవరకు కోవిడ్‌–19 వైరస్‌ బారిన పడకుండా పిల్లలు చాలావరకు తప్పించుకున్నారు. అలాగని వీరికి వైరస్‌తో ఎలాంటి ప్రమాదం లేదని అర్థం కాదు. పెద్దవారికైతే ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి, అది ఇంకా అందనివారికి మందులతో పనిలేని నివారణ పద్ధతులు అంటే మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటివి ఉపయోగంలో ఉంటున్నాయి. వైరస్‌ కాంట్రాక్ట్‌ ప్రమాదం తక్కువగా ఉండి కమ్యూనిటీ కేసులు పరిమితంగా ఉన్నం తవరకు ఇవి పనిచేస్తాయి. అయితే డెల్టా వేరియంట్‌ కానీ, ఇతర వైరస్‌ రకాలు కానీ చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తేలినప్పుడు నష్టం భయం గురించిన మన అంచనాలను పూర్తిగా పునఃపరిశీలించుకోవలిసి ఉంటుంది. ఇప్పటికే బ్రిటన్‌లో యువతలో చాలామంది ఆసుపత్రుల పాలైన నేపథ్యంలో సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ మనకంటే కాస్త ముందే ఉందని గ్రహించాలి. వ్యాక్సినేషన్‌ని అధికస్థాయికి తీసుకుపోవడం,

 

Related posts