telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూ లుక్ తో షాకిచ్చిన విజయ్ దేవరకొండ… !!

Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ ఫాదర్స్ డే సందర్భంగా విషెష్ చెబుతూ తన కొత్త లుక్‌లో తండ్రితో కలిసి దిగిన పిక్స్ షేర్ చేశారు. ”నేను తీసుకునే నిర్ణయాలు, చేసే తప్పులు, నష్టాలు, సాహసాలు అన్నింటా ఆయనే ముందుంటారు. ది ఫస్ట్ దేవరకొండ.. హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ యూ” అని పేర్కొంటూ తండ్రి పక్కనే తాను హ్యాపీ మూమెంట్‌లో కూర్చున్న పిక్ పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఫొటోలో విజయ్ ఫ్రెంచ్ కట్ లుక్‌లో డిఫరెంట్‌గా కనిపించడంతో అంతా షాకయ్యారు. తన తండ్రి గోవర్ధన్ రావుతో, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ దేవరకొండ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ రూపొందుతోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ లాక్‌డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ లుక్ లోకి వచ్చారా? లేక ఆయన లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’ సినిమా కోసమే అని భావిస్తున్నారు నెటిజన్లు.

Related posts