telugu navyamedia
సినిమా వార్తలు

‘ఒకే ఒక జీవితం’ లో “అమ్మ” పాట విడుదల

యంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా న‌టించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ . ఇందులో అక్కినేని అమ‌ల త‌ల్లి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అమ్మ” పాట ఇప్పుడు విడుదలైంది.

ఈ చిత్రం కోసం దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన అమ్మ పాటను అఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘అనునిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలతో ఈ పాట అమ్మకి అంకితం’’ అని పేర్కొన్నారు శర్వానంద్‌. ‘‘అమ్మా.. వినమ్మా’ అంటూ ఈ పాట ఆరంభమవుతుంది. ఈ పాటలో ఒక కొడుకు తల్లితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు.

జేక్స్‌ బిజోయ్‌ స్వరపరచిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ పాడారు. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రానికి శ్రీ కార్తీక్‌ దర్శకుడు. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

Related posts