telugu navyamedia
సినిమా వార్తలు

59 సంవత్సరాల “సత్య హరిశ్చంద్ర”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన మరొక పౌరాణిక చిత్రం విజయా వారి “సత్య హరిశ్చంద్ర” సినిమా 22-04-1965 విడుదలయ్యింది.

ప్రముఖ దర్శక, నిర్మాత కె.వి.రెడ్డి గారు విజయా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్నికి కథ, మాటలు, పాటలు, పద్యాలు: పింగళి నాగేంద్రరావు, స్క్రీన్ ప్లే: కె.వి.రెడ్డి, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు, ఫోటోగ్రఫీ: కమల్ ఘోష్, కళ: గోఖలే, కళాధర్,నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: జి.కళ్యాణ సుందరం, అందించారు.

ఈచిత్రంలో ఎన్.టి. రామారావు, యస్.వరలక్ష్మి, పండరీబాయి, రాజనాల, ముక్కామల, మిక్కిలినేని, రాజబాబు, వాణిశ్రీ, రేలంగి, రాజశ్రీ, రమణారెడ్డి, నాగయ్య, ప్రభాకర రెడ్డి, గుమ్మడి, చదలవాడ, ఎల్.విజయలక్ష్మి, మీనకుమారి, గిరిజ, రాజశ్రీ, మాస్టర్ బాబు తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారధ్యంలో పాటలు, పద్యాలు శ్రోతలను అలరించాయి.
“నీవు మాకు చిక్కినావులే రాజా, మేము నీకు దక్కినాములే, రాజా”
“నమో భూతనాథ, నమో దేవ దేవ,నమో భక్త పాల,
నమో దివ్య తేజా'”
“హేచంద్ర చూడ మదనాంతక శూలఫాణే”
“ఆడ నీవూ,యీడ నేనూ, సూసుకుంటూ కూసుంటే”
వంటి పాటలు, పద్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రాన్ని కె.వి.రెడ్డి గారు ఎంతో కష్టపడి “సత్యమేవ జయతే” ఏనాటి కైనా సత్యమే జయిస్తుందన్న సందేశంతో నిర్మించారు. అయితే ఈ చిత్రం నిర్మాతలు ఆశించిన మేరకు విజయవంతం కాలేకపోయింది.

తెలుగునాట బాగా ప్రాచుర్యం లో ఉన్న హరిశ్చంద్ర నాటకం లోని పద్యాలు ఈ చిత్రం లో లేకపోవటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ముందుకు రాలేదు.

అందువలన ఈ చిత్రం యావరేజ్ గా నడిచి కొన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడింది.
విజయవాడ – దుర్గాకళామందిర్ లో 10 వారాలు (69 రోజులు) ప్రదర్శింపబడింది.

Related posts