telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అకీరాపై రామ్ చరణ్ ఆసక్తికర ట్వీట్

ram-charan

అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ ట్వీట్ చేశాడు. “నా పొడవైన చిట్టి సోదరుడు అకిరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎల్లప్పుడు దయగల వ్యక్తిగా ఉండాలి” అంటూ చెర్రీ ట్వీట్ చేశారు. చెర్రీ ట్వీట్ చేయగానే దానికి వేలల్లో లైకులు వచ్చాయి. మరోవైపు అఖిల్‌ బర్త్ డే సందర్భంగా కూడా రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. అఖిల్‌తో కలిసి దిగిన ఫోటోనే షేర్ చేశాడు. ఇక బన్నీ బర్త్ డే కూడా ఇవాళే. దీంతో బన్నీకు కూడా బర్త్ డే విషెస్ తెలిపాడు చరణ్. “వాస్తవానికి నీకు నేను ఇవాళ కేక్ తినిపించాలి. కానీ దానికి బదులుగా మన చిన్ననాటి అపూర్వమైన జ్ఞపకాల్నే నీకు నేను అందిస్తున్నాను. హేవ్ ఏ గ్రేట్ బర్త్ డే బుంజు” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పాటు… అల్లు అర్జున్ ఉదయం రిలీజ్ చేసిన పుష్ప సినిమా పోస్టర్ కూడా అద్భుతంగా ఉందన్నాడు చరణ్.

Related posts