telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమ కథ రాస్తున్న సల్లూభాయ్

Salman-KHan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. మరోవైపు గాయకుడిగా కూడా అభిమానులను అలరించాడు సల్లూభాయ్. కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నసల్మాన్ ఇప్పుడు తన తండ్రి సలీమ్ ఖాన్ ను ఫాలో అవుతున్నాడట. సల్మాన్ తనలో ఉన్న రచయితను బయటకు తీసే పనిలో ఉన్నాడని బాలీవుడ్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సల్మాన్ కు కావాల్సినంత సమయం దొరికింది. దీంతో ఈ సమయంలో ఓ ప్రేమకథను సిద్దం చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో తన కొచ్చిన సింగిల్ లైన్ ఐడియాను డెవలప్ చేసే పనిలో సల్లూభాయ్ ఉన్నాడని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే లాక్ పూర్తయ్యాక సల్మాన్ ఓ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.

Related posts