రాజమౌళి నేడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి సారి ఆయన ప్రారంభించే చిత్రంపై ప్రాథమిక సమాచారం ఇస్తుంటారు. దానిని ఈసారి అభిమానులముందుకు తీసుకురావడానికి సమయం పట్టిందని అన్నారు. ఈ చిత్రం కూడా ఒక కల్పన అని ఆయన తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాల మాదిరిగానే భారీ సెట్టింగులు ఉంటాయని, మరోసారి జక్కన ప్రతిభ చూస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇక ఈ చిత్రం కథ గా తీసుకున్న అంశానికి వస్తే, నాడు అల్లూరిసీతారామరాజు..కొమరం భీం లు దేశం కోసం స్వాతంత్ర పోరాటం చేసి, పిన్న వయసులోనే బ్రిటిష్ వారి చేతిలో ప్రాణత్యాగం చేశారు. నిజానికి వీరిద్దరూ ఎవరి ఉద్యమంలో వారు ఉన్నారు, ఒకరికేఒకరు తెలియకుండా పోరాటం చేశారు. అదేవిధంగా దేశంకోసం ప్రాణత్యాగం చేశారు. అయితే వీరిద్దరూ ఒకేచోట ఉంది, ఉద్యమంలో పాల్గొని ఉంటె ఎలాఉండబోతుంది అనేదే రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించనున్నట్టే స్పష్టం చేశారు.
ఇక ఈ మాత్రం ప్రకటన చేయడానికి ఇంత సమయం పట్టడానికి కారణంగా రాజమౌళి వీరిద్దరి పై పరిశోధన చేసి, నాటి జీవనవిధానం, పరిస్థితులు, తదితర విషయాలు తెలుసుకోవడానికి సమయం పట్టింది అని చెప్పారు. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్, (అల్లూరి)చరణ్(అలియా భట్), (కొమరం)తారక్(డిజి ఎడ్ గరియోజోన్స్) లు ప్రధాన పాత్రలలో నటించడం ఆనందంగా ఉందన్నారు. చిత్రం టైటిల్ ఆర్.ఆర్.ఆర్ అన్ని భాషలకు కామన్ టైటిల్. కానీ ప్రతి భాషకు ఒక్కో టైటిల్ ఉంటుంది. ప్రజల నుండి ఆర్.ఆర్.ఆర్ కు వచ్చిన అబ్రివేషన్ గమనించాక, వాటి కంటే మంచి టైటిల్ మాకు అనిపిస్తే అదే ఖాయం చేస్తాము.
ఈ సమావేశంలో రాజమౌళి, చరణ్, తారక్, దానయ్య తదితరులు పాల్గొన్నారు. 2020, July 30 will release.
మీటూపై తాప్సి వ్యాఖ్యలు