యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం “సాహో”. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను ప్రారంభించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలోనటిస్తాడని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర మిగలగా… ఆ పాత్రను ఎవరితో చేయించాలని చిత్రబృందం ఆలోచిస్తున్న తరుణంలో, సినిమాలో ఓ కీలకపాత్రలో నటించిన నీల్ నితిన్ ముఖేష్ సల్మాన్ ఖాన్ పేరుని సూచించాడని తెలుస్తోంది. దాంతో యూనిట్ సల్మాన్‌ను సంప్రదించే పనిలో పడిందట. మరి సల్మాన్ ఈ కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనుంది. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
previous post
next post