telugu navyamedia
సినిమా వార్తలు

“దొరసాని” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు

Dorasaani

కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా “దొరసాని” సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. జూలై 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దొరల కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తక్కువ జాతిలో పుట్టిన ఓ కుర్రాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక తేదీని ప్రకటించింది చిత్రబృందం. జూలై 7న హైదరాబాద్, ఫిలిం నగర్ లోని జెఆర్సి కన్వెన్షన్స్ లో సాయంత్రం 6 గంటలకు “దొరసాని” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Related posts