telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టార్చర్ అనుభవించాను… నెపోటిజంపై హీరోయిన్ కామెంట్స్

Vidya Pradeep

బాలీవుడ్ క్రేజీ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. బాలీవుడ్ లో నెపోటిజంపై ఓ యుద్ధమే నడుస్తుంది. నెటిజన్ల ధాటికి తట్టుకోలేక స్టార్స్ గా ఎదిగిన స్టార్ కిడ్స్ అంతా సోషల్ మీడియాకు మొహం చాటేస్తున్నారు. తాజాగా తమిళ నటి విద్య ప్రదీప్ ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలు మరియు నెపొటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.సోషల్ మీడియ ద్వారా విద్య ప్రదీప్ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి షేర్ చేసింది. కెరీర్ ఆరంభంలో తాను టార్చర్ అనుభవించాను. ఆ సమయంలో తాను ఆరు సినిమా ఛాన్స్ లు కోల్పోయాను. ఏ కారణంతో సినిమాల నుండి తప్పించారు అనే విషయాన్ని కూడా తెలియదు. అప్పుడు నాకు గుండెలు పలిగినంత బాధ అనిపించింది. ఇక్కడ నా వల్ల కాదనుకుని మళ్లీ చదువుకోవాలనుకున్నాను. అదే సమయంలో ఓ సినిమా ఛాన్స్ వచ్చింది . దాంతో నాపై నాకే నమ్మకం కలిగింది. కష్టాలను ఎదిరించి నిలబడటం అలవాటు చేసుకున్న అంటూ చెప్పుకొచ్చింది.

Related posts