telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

500 మార్క్ ను క్రాస్ చేసిన ఇంగ్లాండ్…

మొదటి రోజు ఆటలో ఇంగ్లీష్‌ టీమ్‌ కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఇవాళ 263 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌ ఇప్పుడు భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. అయితే రెండో రోజు కూడా రూట్ తన సత్తా చాటుతూ ద్వి శతకం బాదేశాడు. అశ్విన్‌ వేసిన 143వ ఓవర్‌లో సిక్సర్‌ కొట్టిన అతడు.. టెస్ట్‌ ఫార్మాట్‌లో ఐదోసారి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు బెన్‌స్టోక్స్‌ 82పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రూట్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ రూట్ ను 218 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షాబాజ్ నదీమ్ వెనక్కి పంపాడు. దాంతో 482/6 తో ఇంగ్లాండ్ నిలిచింది. అయితే రూట్ కి ఇది 100 వ టెస్ట్ మ్యాచ్ అనే విషయం తెలిసిందే. అయితే 100వ టెస్ట్ మ్యాచ్ లో 200 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 500 మార్క్ ను క్రాస్ చేసింది. డొమినిక్ బెస్(3), బట్లర్(22) తో బ్యాటింగ్ కొనసాగిస్తుండగా… 501/6 తో ఇంగ్లాండ్ నిలిచింది.

Related posts