telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెలరోజుల శిశువుకు ఉచితంగా ఆపరేషన్… సహృదయాన్ని చాటుకున్న మహేష్ బాబు

Mahesh

నెలరోజుల శిశువుకు ఉచితంగా ఆపరేషన్ చేయించి రియల్ హీరో అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో పాప పుట్టింది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. దాంతో ఆ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. కానీ పాప తల్లి తండ్రులు బీదవారు. దాంతో ఓ వ్యక్తి ద్వారా విషయం తెలుసుకున్న మహేష్ పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు. తరవాత పాపను తల్లి తండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈనెల 2వ తేదీన ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసినప్పటికీ పాపకు కొంత అస్వస్థత ఉండటంతో డాక్టర్లు వారం పాటు ఐసీయూ లో ఉంచి కోలుకున్నాక డిశ్చార్జ్ చేసారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts