సూపర్ స్టార్ రజినీకాంత్, బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న చిత్రం ‘తలైవా 169’. ఈ చిత్రానికి ‘జైలర్’ అనే టైటిల్‌తో ఖరారు చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
రక్తపు మరకలు అంటిన కత్తితో ఉన్న ఈ పోస్టర్‌ను చూసి తలైవార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే, ‘బీస్ట్’ పరాజయం కూడా ఒకింత అభిమానులను కలవరపెడుతోంది.
జైలు నేపథ్యంలో రూపొందే ఈ మూవీని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
రజనీకాంత్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటించనున్నట్లు సమాచారం. ప్రియాంక అరుల్ మోహన్ మరో హీరోయిన్‌గా కనిపించునున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంలో ఇంకా కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న హీరో శివ కార్తికేయన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. యంగ్ రజినీ పాత్రలో కార్తికేయన్ కనిపించినున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, కేఎస్ రవికూమార్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
#Thalaivar169 title #Jailor#Rajinikanth𓃵 pic.twitter.com/NvJBoz0AZJ
— Raghav ram (@Raghavr28433175) June 17, 2022
టిక్ టాక్ లు చేసి బాధపెట్టడం దారుణం… నందితాశ్వేత కామెంట్స్