టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వరస హిట్స్ కొడుతున్న బన్నీ వాసు నిర్మాతగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ తీస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో అనసూయ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ చేస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా మరో పాటను రిలీజ్‌కు సిద్దం చేశారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌గా రూపొందిన ‘పైన పటారం ఈడ లోన లొటారం‘ అంటూ సాగనున్న ఈ పాటలో బుల్లితెర బ్యూటీ అనసూయ ఆడి పాడనున్నారు. ఈరోజు ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోను అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో అనసూయ తన డాన్స్‌తో అందరినీ కట్టిపడేస్తున్నారు.
previous post