తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కడప జైలులో కరోనా సోకిన సంగతి తెలిసిందే. వైరస్ సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.ఈ నెల 6వ తేదీన కడప సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై జేసీ విడుదలయ్యారు.
బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్రకుమార్ తో జేసీ వాగ్వాదానికి దిగారని, సీఐను కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన మళ్లీ రిమాండుకు వెళ్లారు.