telugu navyamedia
క్రైమ్ వార్తలు

ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ అరెస్ట్..రెండేళ్ల జైలు శిక్ష

ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ అరెస్ట్ అయ్యారు.  2003లో మానవ అక్రమ రవాణ కేసులో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడంతో పంజాబ్ పోలీసులు దలేర్ మెహందీని అదుపులోకి తీసుకున్నారు.

2003లో మానవ అక్రమ రవాణ కేసులోపంజాబ్​లోని పటియాలా కోర్టు ఈయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ తీర్పును దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు.

గురువారం అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్‌ను తిరస్కరించారు.దీంతో  పంజాబీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని జైలుకు త‌ర‌లించారు..

కాగా..దలేర్ మెహందీ పలు దేశాల్లో పాడటానికి వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలతో ఆయా దేశాలకు తీసుకెళ్లి అక్కడే ఒదిలేసేసారు. ఇలా ఈయన పాట కచేరి జరిగిన దేశాల్లోకి అక్రమంగా వ్యక్తులకు తీసుకెళ్లి ఒదలిపెట్టేవాడు. ఇందులో దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ పాత్ర ఉంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడాలనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ ..  అక్కడ ఒదిలి పెట్టి రావడానికి ఇక్కడ తగినంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి  దండుకునేవాడని పోలీసులు అభియోగం మోపడంతో పాటు వాటిని సాక్ష్యాలతో సహా ఋజువు చేసారు.

దీంతో పాటియాల కోర్టు 15 యేళ్ల తర్వాత మానవ అక్రమ రవాణా కేసులో దలేర్ మెహందీకి 2 జైలు శిక్ష విధించింది. దలేర్ మెహందీ పై మానవ అక్రమ రవాణా కేసులో దాదాపు 31 కేసులు నమోదు అయ్యాయి. ఇక 2003లో అమెరికాలో ఈయన పై మొదటి అభియోగం మోపబడింది. ఈయన ఎక్కువగా తన వెంట తీసుకెళ్లిన వాళ్లను అమెరికాలోనే ఎక్కువగా విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో మొదటి కేసు యూఎస్‌లో నమోదు అయింది.

దలేర్ మెహందీ విషయానికొస్తే.. 18 ఆగష్టు 1967 బిహార్‌లోని పాట్నాలో జన్మించారు. ఈయన సింగర్‌గా, పాటల రచయతగా.. నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా భాంగ్రా డాన్సుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘బోలో తరా రా రా’ పాటతో ఎక్కుగా పాపులర్ అయ్యారు. బాలీవుడ్‌లో అమితాబ్ .. ‘మృత్య దాత’ మూవీతో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు.

Related posts