telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

నటుడు సచిన్‌ జోషి అరెస్ట్ ..

గుట్కా అక్రమ రవాణా చేస్తున్న నేపంతో ముంబయిలో నటుడు సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇప్పుడిది బాలీవుడ్‌లో మరింత కలకలం సృష్టిస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి. సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో అరెస్ట్ చేసారు పోలీసులు.

అయితే గత కొన్ని రోజులుగా ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు జరుపగా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు నమోదు చేసారు. అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి..పెద్ద మొత్తం లో గుట్కా బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉందని పోలీసులు వెల్లడించారు.

Related posts