చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన స్ధానంలో ఇన్‌చార్జ్ కమిషనర్‌గా సానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావును నియమించారు.
నగరిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తోందని వీడియోలో వెంకటరామిరెడ్డి వాపోయారు. పెరుగుతున్నా తమకు రక్షణ కవచాలు లేవంటూ ఆయన సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సెల్పీ వీడియో ప్రభుత్వం దృష్టికి పోయింది. వెంకటరామిరెడ్డి ప్రభుత్వం నింబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
రెండు రోజుల క్రితం నర్సీపట్నం ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనను బుధవారం సస్పెండ్ చేసింది. డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలతో పాటు వెంకటరామిరెడ్డి చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ఇద్దరి వ్యాఖ్యలు అటు వైద్యశాఖలో, ఇటు మున్సిపల్ శాఖలో ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.