telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తన మొదటి ముద్దు అనుభవం తెలిపిన .. కంగనా రనౌత్ ..

khangana about her first kiss with

హాట్ బ్యూటీ కంగనా రనౌత్..ఏ విషయమైనా ఏ మాత్రం సిగ్గు పడకుండా బయటకు చెప్పేస్తుంది. ఇప్పటికే పలు విషయాల పట్ల స్పందించిన ఈమె ..తాజాగా తన తొలిముద్దు అనుభవాన్ని తెలిపి అబ్బా అనిపించింది. ఢిల్లీలో `ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019` పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కంగన తన ఫస్ట్ క్రష్ కి సంబంధించిన విషయాల్ని తెలిపింది. 17 ఏళ్ల వయసులో ఓ పంజాబీ యువకుడితో ప్రేమలో పడ్డానని అప్పుడతని వయసు 28 అని.. తనని తొలిసారి చూడగానే డేట్ కు వెళ్లాలని అనిపించిందని చెప్పుకొచ్చింది. అప్పుడు నేను చంఢీఘర్ లో వుండేదాన్ని. ఆ సమయంలో నా స్నేహితురాలు డేటింగ్ లో వుంది.

తనని చూశాక నాకూ డేట్ కు వెళ్లాలని పించింది. 28 ఏళ్ల ఓ పంజాబీ యువకుడు చాలా క్యూట్ గా వుండేవాడు. నన్ను చూసి నువ్వింకా చిన్న పిల్లవని చెబుతుండేవాడు. దానికి తోడు నాకు లవ్.. డేటింగ్ అంటే కొత్త. నాకు నేను ఓ కన్ ఫ్యూజన్ లో వున్న ప్రేమికురాలిగా నాకు నేనే అనుకునేదాన్ని. `నేనూ ఎదుగుతాను. నాకూ ఓ ఛాన్స్ ఇవ్వండని అతనికి మెసేజ్ లు పంపేదాన్ని. నా తొలి ముద్దు అనుభవం కూడా చాలా దారుణంగా జరిగింది. అతన్ని కిస్ చేయడం కోసం ప్రాక్టీస్ కూడా చేశాను. ఫైనల్ గా తను కిస్ చేస్తున్న సమయంలో ఫ్రీజ్ అయిపోయాను..అంటూ చెప్పుకొచ్చింది.

Related posts