telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మారుతున్న రాజకీయాలు.. బిజెపిలోకి రేవంత్, ఈటల ?

తెలంగాణలో రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది…ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే సీనియర్ లీడర్ ల సహకారం లేకపోవడం తో పిసిసి అధ్యక్ష పదవి రాకుండా పోయింది… కాంగ్రెస్ లోకి ఇంత పెద్ద నాయకుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ముందుక వెల్లనివ్వరు… ఈ కారణంగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసినారు… కావున ఈటెల రాజేందర్ గారికి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన లేదు అలాగని కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లి గ్రామస్థాయిలో బూతు స్థాయిలో బలపడటానికి చాలా సమయం పడుతుంది మరియు కొత్త పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ నీ ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి ఇటువంటి సమీకరణాలు బేరీజు వేసుకొని బీజేపీలోకి వెళ్లాలని ఆలోచించినట్లు తెలుస్తుంది… బిజెపి లోకి వెళ్తే అగ్రనాయకత్వం మనకు అండదండగా ఉంటుంది మనకు పూర్తిగా సహాయ సహాయ సహకారాలు అందిస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఈ సమీకరణల దృస్ట్యా రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో. చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది

Related posts