సాయికుమార్ తనయుడు ఆది సాయి కుమార్ తాజాగా విశ్వనాథ్ దర్శకత్వంలో “జోడి” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సరసన హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదిని కొత్త కోణంలో చూపించనున్నాడట దర్శకుడు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేష్ గుర్రం మరియు పద్మజ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, మిర్చి మాధవి, గొల్లపూడి కీలక పాత్రలు పోషించారు. ఉగాది పండుగ సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో హీరోయిన్… “మీరెంటి ఇక్కడ?” అని ప్రశ్నించగానే హీరో “మా నాన్నకి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. ఐదు కేజీలు కొందామని మైసూర్ వెళుతున్నా” అని చెప్పిన డైలాగ్ అభిమానులని ఆకట్టుకుంటుంది. కామెడీతో పాటు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రమైనా ఆదికి మంచి హిట్ అందిస్తుందేమో చూడాలి. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
previous post
నాగబాబు కౌంటర్ పై బాలయ్య స్పందన