telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : … రావలసిన డబ్బు అందుతుంది… తల్లిదండ్రుల ఆరోగ్యం జాగర్త…

today rasi falalu

మేషం : ఈ రోజు ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేసే అవకాశముంది. ఆవేశానికిలోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దాని కారణంగా తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీ జీవితభాగస్వామికి సంబంధించిన విషయంలో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు.

వృషభం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలించే దినం. రావలసిన డబ్బులు తిరిగి రావటమే కాకుండా, పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాదాలు సమసి పోతాయి. వృత్తిలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

మిథునం : ఈ రోజు కొత్తవారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం : ఈ రోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

సింహం : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం.

కన్య : ఈ రోజు ఉద్యోగవిషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

తుల : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వల్ల మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని అవమానం పాలవకండి.

వృశ్చికం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు.

కుంభం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

మీనం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

Related posts