telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” టీజర్ వర్సెస్ “సాహో” సాంగ్

Saaho

స్వాతంత్ర్య సమరయోథుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా”. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తుండగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఇప్పటి వరకూ ఈ టీజర్ 23.2 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం “సాహో”. ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 30న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రంలోని “బ్యాడ్ బాయ్” సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఇప్పటివరకూ ఈ సాంగ్‌ 20 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ మూవీని కూడా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు.

Related posts