telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

వివేకా హత్య కేసులో రంగంలోకి కొత్త బృందం..

కడప జిలాల్లోని వివేకా హత్య కేసులో దర్యాప్తు కొనసాగింపుకు త్వరలో రంగంలోకి కొత్త బృందం దిగనుంది. ఈ ఏడాది జూలై 9న కేసు నమోదు చేసింది సీబీఐ. వివేకా హత్య పై నాడు కారణం తెలియక పోవడంతో అనుమానస్పదం కింద కేసు నమోదు చేసారు. ఇప్పుడు ఐపిసి సెక్షన్ 302 హత్యానేరం అభియోగంతో కేసును కొత్తగా రీ రిజిస్టర్ చేసింది సిబిఐ. ఈ కేసులో దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీ లోని ప్రత్యేక నేరాల విభాగం మూడవ బ్రాంచికి అప్పగించారు. తొలుత వివేకా మృతిని సీఆర్పీసీ 174 సెక్షన్ (మృతికి కారణం తెలియదంటూ) కింద కేసు నమోదు చేసారు పోలీసులు. వివేకా కుమార్తె పిటీషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు బాధ్యతలు చేపట్టినట్లు ఎఫ్ఐఆర్ లో సీబీఐ పేర్కొంది. వివేకా కేసు పై దర్యాప్తు అధికారిగా ప్రత్యేక నేరాల విభాగం మూడవ బ్రాంచికి డీఎస్పీ దీపక్ గౌర్ నియమించబడ్డారు. అయితే ప్రస్తుతం సీబీఐ అధికారులకు కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా విచారణ నిలిచిపోయింది. ఇక త్వరలొ కొత్త బృందం రాకతో విచారణ ప్రారంభం కానుంది.

Related posts