telugu navyamedia
క్రైమ్ వార్తలు

జూబ్లీహీల్స్ రేప్ కేసు: మైన‌ర్లకు 4 రోజులు క‌స్ట‌డీకి జువైనల్‌ హోం అనుమ‌తి..

*జూబ్లీహీల్స్ రేప్ కేసు ప్ర‌ధాన నిందితుడును క‌స్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు
*9 ప్ర‌శ్న‌ల‌ను సిద్ధం చేసుకున్న పోలీసులు..

*ఐదుగురు మైన‌ర్లకు రేప‌టినుంచి 4 రోజులు క‌స్ట‌డీకి జువైనల్‌ హోం అనుమ‌తి
* ఐదుగురు మైనర్లను పొటెన్సీ టెస్ట్ కు కోర్టుకు అనుమ‌తి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు మైన‌ర్లుకు రేప‌టినుంచి నాలుగు రోజులు క‌స్ట‌డీకి జువైనల్‌ హోం అనుమ‌తి ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా జువైన‌ల్స్ త‌మ అడ్వ‌కేట్‌ను క‌లిసేందుకు అనుమ‌తిచ్చింది. క‌స్ట‌డీ త‌రువాత తిరిగి జువైన‌ల్ కోర్టుకు త‌ర‌లించాల‌ని ఆదేశించారు.

కాగా ఇప్ప‌టికే మైన‌ర్ల‌ను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్‌ ను పోలీసులు కోరారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు A-1 సాదుద్దీన్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. చంచ‌ల్‌గూడ‌జైల్ నుంచి నేరుగా వైద్య ప‌రీక్ష‌ల‌కు కోసం ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు సాదుద్దీన్‌ను పోలీసులు విచరించనున్నారు. ఈ సంద‌ర్భంగా అత్యాచారం నుంచి రేప్ దాకా మాలిక్ ను 9 ప్ర‌శ్న‌ల‌ను వేసి స‌మాధానాలను రాబ‌ట్టాల‌ని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులుసిద్ధం చేసుకున్న 9 ప్ర‌శ్న‌ల‌ను ఇవే

1.రేప్ చేయాల‌ని ఉద్దేశంతోనే ప‌బ్బుకు వెళ్ళారా?
2.అమ్మాయిని వేధించింది ఏవ‌రు?
3.అత్యాచారం చేయాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది?
4.బెంజి- ఇన్నోవా కార్లు న‌డిపిందెవ‌రు
5. ముందుగా బాలిక‌పై రేప్ చేసిందెవ‌రు?
6.మొయినాబాద్ వెళ్ళాల‌న్న ఆలోచ‌న ఎవ‌రిది?
7నిందితుల‌కు స‌హ‌క‌రించిందెవ‌రు?
8. వీడియోలు రికార్డు చేసిందెవ‌రు?
9.సోష‌ల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిందెవ‌రు?

అంతేకాకుండా. ఐదుగురు మైనర్లను పొటెన్సీ టెస్ట్ కు కోర్టులో అనుమ‌తి కోరనున్నారు. నిందితుల‌కు లైగింక ప‌టుత్వం ఉందా లేదా అనేది పొటెన్సీ టెస్ట్‌తో నిర్ధార‌ణ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Related posts