telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వాళ్ళు తల్లిదండ్రులు కాదు… ఆ పిల్లాడి పాలిట రాక్షసులు…!

Boy

ఎనిమిదేళ్ల ఆ పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్‌గా వచ్చాడు. దీంతో ఆగ్రహించిన అతని పెంపుడు తండ్రి.. ఇంటికొచ్చిన పిల్లాడిని తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత నేలపై గోధుమల జాతికి చెందిన కొన్ని గింజలు (బక్‌వీట్ విత్తనాలు) పోసి, వాటిపై పిల్లాడిని మోకాళ్లపై కూర్చోబెట్టాడు. ఇలా కాసేపు కూసేపు కాదు ఏకంగా 9గంటలు కూర్చోబెట్టాడు. దీంతో పిల్లాడి మోకాళ్లపై చర్మం తెగి రక్తం కారడంతో తడిచిన ఆ విత్తనాలు.. అతని కండలోనే మొలకలెత్తాయి. దీంతో ఆ పిల్లాడు కనీసం లేచి నిలబడలేకపోయాడు. కాసేపటికి తండ్రి పక్కకు వెళ్లినపుడు ఇంట్లోంచి ఎలాగోలా బయటకు పారిపోయిన ఆ పిల్లాడు.. పక్కింటికెళ్లి తలుపు కొట్టాడు. కన్నీళ్లతో తనకు సాయం చేయాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు పిల్లాడి కాళ్లలో మొలకెత్తిన విత్తనాలను చూసిన పొరుగింటివారు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మత్తుమందిచ్చి పిల్లాడి మోకాళ్లలోని గింజలను వైద్యులు తొలగించారు. అతని తండ్రి సార్జే కాజకోవ్(35)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లాడిని ఇలా శిక్షించడానికి తల్లి అలీనా యుమషేవ (27) కూడా అంగీకరించిందని తెలిసి పోలీసులు షాకయ్యారు. దీనిపై ఆమెను ప్రశ్నించగా.. తను, సార్జే ఆన్‌లైన్లో వెదికి ఈ టార్చర్ పద్ధతిని కనుగొన్నామని, ఆ గింజలపై కూర్చుంటే ఎటువంటి నొప్పీ ఉండదని చెప్పింది. అందుకే తను ఆ శిక్షకు ఒప్పుకున్నానని బుకాయిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అలీనాను గృహనిర్భందం చేశారు. సార్జేను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పిల్లాడిని అలీనా వద్దకే పంపినట్లు సమాచారం.

Related posts