telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కీలక వ్యాఖ్యలు…

తన కౄరత్వంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. అయితే ఆయుధ సంపత్తి పెంచుకోవడం, చైనాతో మినహా చుట్టుపక్కల ఉన్న దేశాలతో గొడవలు పెట్టుకోవడం, అణ్వస్త్రాలను తయారు చేస్తుండటంతో ఆ దేశంపై ఆంక్షలు విధించారు.  ఇక నిత్యం అమెరికాతో గొడవలు పెట్టుకోవడంతో ఆర్ధికంగా మరింత ఇబ్బందులు కొనితెచ్చుకుంది.  కరోనా తరువాత ఆ దేశం పరిస్థితి మరింత దిగజారిపోయింది.  చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశ సరిహద్దులను మూసేశారు.  దేశంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేశారు.  ఈ లాక్ డౌన్ తో ఆ దేశం ఆర్ధికంగా మరింత దిగజారిపోయింది.  కాగా, దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, దేశ ప్రజల ఆర్ధిక ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, పార్టీ కార్యకర్తలు బాధ్యతలు తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అయితే ఎప్పుడు దేశ భవిష్యత్తు గురించి మాట్లాడని కిమ్ ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడంటే ఆ దేశ ఆర్ధిక పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.

Related posts