telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంకా ఆరోగ్య శాఖ మంత్రిగానే ఈటల.. ఇవే సాక్షాలు !

ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు టీఆర్ఎస్ ను వీడి.. అడ్రసు లేకుండా పోయారని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించగా… కొందరు మాత్రం ఈటలకే జై కొడుతున్నారు. ఇక మొత్తానికి టీఆర్ఎస్ కు ఈటలకు బంధం తగినట్లే కనిపిస్తోంది. మరీ ఈటల నెక్స్ట్ స్టెప్ అని ఏంటి ? అని తెలంగాణలో బాగా చర్చ జరుగుతోంది. సొంత పార్టీ పెడితే.. నడిపే సత్తా ఈటలకు ఉందా ? అనే సందేహం కలుగక మానదు. మరీ కాంగ్రెస్, లేదా బిజేపి లోకి వెళ్లాల్సి వస్తుంది ఈటల. ఒకవేళ కాంగ్రెస్ కు పోతే.. ఈటల రాజకీయ భవిష్యత్తు ముగుసినట్లే అంటున్నారు కొందరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితే ప్రశ్నార్థకంగా ఉంది.

ఇపుడు ఆ పార్టీలోకి పోతే.. ఈటల రాజకీయ భవిష్యత్తు కష్టమే. మరీ బిజేపి కి పోతారని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే ఇటీవలే రైతు చట్టాల నేపథ్యంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశారు ఈటల. ఏది ఏమైనా ఈటల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టీఆర్ఎస్ వీడి.. ఈటల తప్పు చేశారని మరికొందరి వాదన. ఈటల అలక మాని.. మళ్ళీ కెసిఆర్ దరికి.. చేరుతారని మరికొందరి వాదన. అయితే కెసిఆర్ తో సంధికే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. టీఆర్ఎస్ మొదటి సర్కార్ లో తాటికొండ రాజయ్య ఘటనే ఉదాహరణ. దీనికి ఓ ఉదాహరణ.. ఈటలను టిఆర్ఎస్ నుంచి ఇంకా సస్పెండ్ చేయకపోవడం.. ఒకటైతే.. గాంధీ మెడికల్ కాలేజీ & ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్ సైటులో ఇప్పటికీ కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల వివరాలు కనిపిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రి అధికారిక పోర్టల్ లో ఇంకా ఈటల వివరాలు తీసివేయకపోవడంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఈటల టీఆర్ఎస్ ను వీడే ఆలోచన లేదా ? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts