భగీరథ లోకేశ్వరి, పురందేశ్వరి ఆవిష్కరించిన “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్” . విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ” మహానటుడు, ప్రజానాయకుడు -ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని అన్నగారి కుమార్తెలు లోకేశ్వరి ,పురందేశ్వరి ఆవిష్కరించారు.
మొదటి ప్రతిని పరిటాల సునీత స్వీకరించారు. ఈ పుస్తకాన్నిభగీరథ ఆంధ్ర జ్యోతి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కానూరి జగదీష్ ప్రసాద్ కు అంకితం చేశారు . హైదరాబాద్ ఫిలిం నగర్ లో శనివారం ఉదయం తెలుగు నిర్మాతల మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ .టి .ఆర్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తారక రామారావు విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు మాగంటి గోపినాథ్ ఆవిష్కరించారు . అనంతరం జరిగిన సభలో భగీరథ రచించిన “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్” గ్రంథావిష్కరణ జరిగింది . ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి రోజున ఆ మహనీయుని శ్రీకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడం తో నా జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నానని చెప్పారు .
జర్నలిస్టు భగీరథ ఎన్ .టి .ఆర్ మీద పుస్తకం వ్రాయడం ఎంతో సముచితంగా ఉందని గోపి తెలిపారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ . ఎన్ .టి .ఆర్ శత జయంతి రోజు వారి కుమారుడు మోహన కృష్ణ సహకారంతో ఫిలిం నగర్ లో రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం ఎంతో ఆనందంగా ఉందని , ఈ రోడ్ కు ఎన్ .టి .ఆర్ మార్గ్ అని నామకరణం చేయించవలసిందిగా గోపి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలాగే సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రామారావు గారి మీద పుస్తకం వెలువరించడం కూడా మాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పారు .
నిర్మాతలమండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ , ఫిలిం నగర్ లో అన్న గారి విగ్రహాన్ని పెట్టాలనే ప్రతిపాదన రాగానే మోహన కృష్ణ గారు ముందుకు వచ్చారని , ఫిలిం నగర్ తరుపున ఆదిశేషగిరావు , సూర్యనారాయణ , శాసన సభ్యుడు మాగంటి గోపి గారు సంపూర్ణ సహాయ సహకారాన్ని అందించారని చెప్పారు . రామారావు గారితో జర్నలిస్టుగా సాన్నిహిత్యం వున్న భగీరథ గారు “మహానటుడు,ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకం వ్రాయడం కూడా మాకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు .
పుస్తక రచయిత భగీరథ మాట్లాడుతూ – ఎన్ .టి .రామారావు గారితో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని, ఆయనతో ఎన్నో ఇంటర్వ్యూ లు చేశానని, ఆయన సినిమా జీవితం మరియు రాజకీయ జీవితంలో ముఖ్య ఘట్టాలను ఇందులో వ్రాయడం జరిగిందని, ఎన్ .టి .ఆర్ కు సంబంధించిన సరికొత్త విషయాలను తెలియజేచానని చెప్పారు. నిర్మాతల మండలి సహకారంలో తాను ఈ పుస్తకాన్ని 17 రోజుల్లో పూర్తి చేశానని చెప్పారు . శత జయంతి రోజున ఈ పుస్తకాన్ని రామారావు గారి ఇద్దరు కుమార్తెలు లోకేశ్వరి , పురందేశ్వరి ఆవిష్కరించడం ఎంతో ఆనడం గా ఉందని భగీరథ చెప్పారు .
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారులు జయకృష్ణ , మోహన కృష్ణ , రామ కృష్ణ , లోకేశ్వరి ,పురందేశ్వరి , మనుమలు , మనవరాళ్ళు ,సినిమా రంగానికి చెందిన ఎందరో పాల్గొన్నారు .
ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం: నటి మాధవీలత