telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వర్కవుట్స్ చేస్తూ సొగసులు చూపిస్తున్న తమన్నా…

15 ఏళ్ల వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. అదే ఏడాది తెలుగులో శ్రీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం తెలుగులో తమన్నాకు మంచి బ్రేక్ అందించింది. అప్పటినుండి మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపుగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. ఇటీవల తమన్నా కరోనా బారిన పడి.. కోలుకున్న తరువాత ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ  తన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తమన్నా తనకు తగ్గ లైట్ వెయిట్ వర్కవుట్స్ చేస్తూ చాలా నాజూగ్గా కనిపించింది. వీడియోను ఉద్దేశిస్తూ తమన్నా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చాలని.. వ్యాయామానికి మరీ ఎక్కువగా కూడా కష్టపడాల్సిన పని లేదని, నిలకడగా చేస్తే చాలని తమన్నా పోస్ట్ చేసింది. కాగా, చాలా ఏళ్ల నుంచి ఒకే తరహా గ్లామర్ ను మైంటైన్ చేస్తూ వచ్చిన తమన్నా.. కరోనా సమయంలో  కాస్త బరువు పెరిగింది. ఆ తరువాత తదుపరి సినిమాల కోసం తమన్నా మునుపటి లాగే మరింత ఫిట్‌గా తయారైయిందనే చెప్పాలి. ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో చేస్తుంది. చూడాలి మరి ఈ సినిమాలు అభిమానులను ఆకట్టుకుంటాయా లేదా నేది.

Related posts