టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరున్నజంటల్లో సమంత, నాగచైతన్య జంట ఒకటి. గతేడాది అక్టోబర్2న విడాకులు తీసుకుంటున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికి విడాకుల ఇష్యూ సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది.
విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటికీ వారు బయటకు చెప్పలేదు కానీ నెటిజన్లలో ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాలుగేళ్ల వివాహ బంధం తెంచుకోవడం వెనుక రీజన్స్ ఏమై ఉంటాయనే కోణంలో ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి.
తాజాగా చైతూ తండ్రి అక్కినేని నాగార్జున ఈ ఇష్యూపై రెస్పాండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. సమంతనే చైతూ నుంచి మొదట విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతూ ఒప్పుకున్నాడని నాగార్జున అన్నట్లు ఉదయం నుంచి కథనాలు రావడం జరిగింది. అయితే ఈ న్యూస్ పై నాగర్జున స్పందించారు.
సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడాయాలో తాను మాట్లాడినట్టుగా సర్కులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా తప్పుడు వార్తలని కొట్టిపడేశారు. మీడియా పుకార్లను వార్తలుగా సర్కులేట్ చేయవద్దని ఆయన మీడియా మిత్రులను విజ్ఞప్తి చేసిన నాగార్జున… మీడియా న్యూస్ ఇవ్వాలి కానీ.. పుకార్లను కాదని కోరారు.