telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శంకర్ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ?

Payal-Rajputh

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం ద్వారా భారీ ఫాలోయింగ్ ను దక్కించుకున్న బ్యూటీ‌ పాయల్‌రాజ్‌పుత్‌. ఇప్పటికే పలువురు అగ్రహీరోల సినిమాల్లో అవకాశం కొట్టేసిన పాయల్ కు ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలొస్తున్నాయి. ఇటీవ‌ల ప్రియుడు సౌరభ్‌ ధింగ్రా దర్శకత్వం వహించిన ఓ లఘు చిత్రంలో నటించింది పాయల్‌ రాజ్‌పుత్‌. ‘ఏ రైటర్‌’ పేరుతో రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను కేవలం 24 గంటల్లో చిత్రీకరించారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా జీనియ‌స్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న “ఇండియ‌న్ 2” సినిమాలో అవకాశం ద‌క్కించుకుంద‌ట పాయ‌ల్‌. చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ కోసం పాయ‌ల్ రాజ్‌పుత్‌ని తీసుకోవాల‌ని శంక‌ర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. 1996లో వ‌చ్చిన “ఇండియ‌న్” చిత్రానికి సీక్వెల్‌గా “ఇండియ‌న్-2” చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్ధ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నాడు. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత చిత్ర షూటింగ్‌ని శ‌ర‌వేగంగా జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts