telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెరాస మినిస్టర్ తలసానితో చిరంజీవి,నాగార్జున భేటీ

ఫిబ్రవరి 4న హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ నివాసంలో.. చిరు, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. సినిమా రంగం అభివృద్ధికి సంబంధించి మంత్రి వారితో చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని.. దీనికి సంబంధించి సినిమా రంగానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సినీ నటులు చిరంజీవి నాగార్జునతో భేటీ అయినట్లు మంత్రి తలసాని తెలిపారు. సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.గతేడాది డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్‌లో జరిగిన ‘టీవీ9 నవ నక్షత్ర అవార్డుల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను సినీ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ సినీ ప్రముఖలందరితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు.హైదరాబాద్‌లో ఏడాదికి 250 సినిమాల వరకు నిర్మాణం అవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరంలో రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో తదితర ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయని గుర్తుచేశారు. సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి భాగ్యనగరంలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

Related posts