telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అరణ్య ట్రైలర్ అప్డేట్…

దగ్గుబాటి రానా నటించిన ‘అరణ్య’ మూవీ వచ్చే నెల 26 న విడుదల కానున్న విషయం తెలిసిందే. హిందీలో హాథీ మేరీ సాథీగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వనున్న‌ది. ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తుండగా.. రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్రధారులు పోషిస్తున్నారు. ఈ చిత్రం పర్యావరణ ఇతివృత్తంతో రూపొందినట్టు తెలుస్తోంది. 25 సంవ‌త్స‌రాలుగా అర‌ణ్యంలో జీవిస్తున్న ఒక మ‌నిషి క‌థ ‘అరణ్య‌’. ఈ చిత్రం ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు, అట‌వీ నిర్మూల‌న సంక్షోభంపై దృష్టి పెడుతోంది. మానవుల స్వార్థం కోసం అడవుల ఆక్రమ‌ణ‌, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వ‌ల్ల ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అప్డేట్ వచ్చింది. మరో రెండు రోజులో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇక ఇందులో రానా పాత్రకు సంబంధించిన లుక్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో చిత్రంపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది.

Related posts