మేషరాశి..
బంధు, మిత్రులతో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ముఖ్య మైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచడం మంచిది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
వృషభరాశి..
నూతన పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం ఉంటుంది. సోదరులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారాల్లో చిక్కులు సమిసిపోతాయి. దైవ దర్శనాలు చేస్తారు. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.
మిథునరాశి..
మానసికంగా ధృడంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం కోరుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమకు తగిన ఫలిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు వస్తాయి.
కర్కాటకరాశి..
బందువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు . ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు . పనులలో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా కలిసిరావు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేస్తారు. పిల్లలు పనులు చికాకు తెప్పిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ద చూపించడం మంచిది.
సింహరాశి..
భార్యభర్తలు మద్య చికాకులు ఎదురవుతాయి. అధికంగా ధనం ఖర్చు అవుతుంది. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు కలిసిరావు . ఉద్యోగస్తులు పై అధికారులు దగ్గర మెలుకవ అవసరం.
కన్యరాశి..
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వాహనయోగం కలుగుతుంది. అనారోగ్యం సూచన. విద్యార్ధులు రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు.
తులరాశి..
శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. వ్యాపారాలు అంతగా కలిసిరావు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి.
వృశ్చికరాశి..
నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలిసివస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాల్లో ఒత్తిడులు తొలగుతాయి. దైవదర్శనాలు చేస్తారు.
ధనుస్సురాశి..
ఆకస్మిక ధన లాభం పొందుతారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణాలు అధికంగా చేస్తారు. ప్రయాణాలలో మార్పులు ఏర్పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువర్గంతో తగాదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో చిక్కులు ఏర్పడతాయి.
మకరరాశి..
బాధను కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. గృహయోగం కలుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి రోజులు వస్తాయి.
కుంభరాశి..
బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.
మీనరాశి..
మానసికంగా ప్రశాంతత అవసరం. మిత్రులతో మాటపట్టింపులు ఎక్కువవుతాయి. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా పడతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. దైవదర్శనాలు చేస్తారు. ధనం అధికంగా ఖర్చుఅవుతుంది.