మేషం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. బంధువర్గం నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృషభం : బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
మిథునం : సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్య సమాచారం రాగలదు. ఆప్తులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవదర్శనాలు.
కర్కాటకం : కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు.
సింహం : కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కన్య : సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు. పనుల్లో విజయం. కొన్ని వివాదాలు పరిష్కారం.. బంధువుల నుంచి ధనలాభం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.
తుల : బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
వృశ్చికం : బంధువులతో కొన్ని వివాదాలు. ఆరోగ్యభంగం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. దైవదర్శనాలు. .
ధనుస్సు : ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి. దూరపు బంధువుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వాహనయోగం.
మకరం : కొత్త పనులు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు కొంత తగ్గుతాయి.
కుంభం : రుణయత్నాలు చేస్తారు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
మీనం : ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.