telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 3, బుధ‌వారం రాశిఫ‌లాలు…

మేషం..
ఆర్థికాభివృద్ధి.. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. అధికారులకు తరచూ పర్యటనలు, ఒత్తిడి అధికం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం..
పనుల్లో కొంత జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. చెల్లింపులు, బ్యాంకు చెక్కులు జారీలో జాగ్రత్త అవసరం. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మరింత శ్రద్ధ అవసరం.

మిథునం..
ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. మీ ముఖ్య విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించండం మంచిది.ఆరోగ్యం కుదుటపడుతుంది.

కర్కాటకం
రిటైర్డు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ అందుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి సాధిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, సంఘంలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు.

సింహం
అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక నష్టాలు రావచ్చు. విద్యార్థులు సృజనాత్మకతతో పనిచేయాల్సిన రోజు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆకస్మిక ధన లాభం, కార్యసిద్ధి. దైవ సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.

కన్య..
బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం క‌లుగుతుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సంప్రదింపులు, వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్య యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఆదాయానికి తగ్గుట్టుగా ఖర్చులుంటాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి.

తుల..
స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఖర్చులు, అధికం, ప్రయోజనకరం. బంధుమిత్రులకు సహాయ సహకారాలందిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లభాలు గడిస్తారు. వృత్తులు వారికి అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది.

వృశ్చికం..
వాహనయోగం కలుగుతుంది.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. హామీలు, నగదు చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వైద్యులకు బాధ్యతల్లో అలక్ష్యం మంచిదికాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు.

ధనస్సు ..
ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంరాజకీయాల్లో వారికి పదవులు సభ్యత్వాలకు మార్గం సుగమమవుతుంది. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో వల్ల ఇబ్బందులు పడుతారు.

మకరం..
భాగస్వామి వ్యాపారంతో లాభాలు గడిస్తారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అధికం అవుతాయి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కుంభం
స్వల్ప అనారోగ్యం. సోదరులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఆదాయం సంతృప్తికరం.గృహ నిర్మాణల పనుల ప్రారంభంలో మందగించినా క్రమేపీ వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే సూచనలు అధికంగా ఉన్నాయి.ఆఫీస్లో మంచి వాతావరణం.

మీనం ..
కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన రోజు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు సహాయ సహకారాలు అందివస్తాయి. ఉద్యోగస్తులు గుట్టుగా ప్రమోషన్ యత్నాలు సాగించాలి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

Related posts