telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 3, సోమ‌వారం రాశిఫ‌లాలు…

మేషరాశి..

వ్యవహారాలు ముందుకు సాగవు. ఫీజులు, బిల్లులు చెల్లింపుల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్య‌మైన ప‌నుల్లో శ్రమ తప్పదు. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం ఆస‌న్న‌మైంది.

వృషభరాశి..

కష్టానికి త‌గిన‌ ఫలితం కనిపించదు. అన్న త‌మ్ముల మ‌ధ్య ఆస్తి వివాదాలు త‌లెత్తుతాయి. బంధువుల‌తో గొడ‌వ‌లు నెల‌కొంటాయి. ధ‌నం వృదాగా ఖ‌ర్చు అవుతుంది. .కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తుంది..జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు తొలుగుతాయి.

మిథునరాశి..

ముఖ్య‌మైన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలు వస్తాయి. పెద్దల నుంచి కీలక ఒప్పందాలు. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.ద్యోగాలలో ఇబ్బందులు తీరతాయి.

కర్కాటకరాశి..

అనుకోని ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి పనులలో విజయం చేకూరుతుంది. భూవివాదాలు తీరతాయి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. దైవ దర్శనాలు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.

సింహరాశి..

బంధువులు, మిత్రులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు త‌లెత్తుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విందులు, వినోదాలలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు.

కన్యరాశి..

కుటుంబంలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం బారిన ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తికి సంబంధించి చాలాకాలంగా ఉన్న సమస్యలు, వివాదాలు తీరుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త వ‌హించ‌డం మంచిది. స్త్రీలకు వారి రంగాల్లో ప్రతిభకు మంచి గుర్తింపు ల‌భిస్తుంది.

తులరాశి..

ఆరోగ్యంపై జాగ్రత్త వ‌హించ‌డం మంచిది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మిత్రుల నుంచి అప‌వాద‌లు ప‌డ‌తారు. సంఘంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. వాహనయోగం. ముఖ్యులతో చర్చలు. వస్తులాభాలు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీ సేవలకు గుర్తింపు ల‌భిస్తుంది.

వృశ్చికరాశి..

కుటుంబంలో అనుకోని చికాకులు త‌లెత్తుతాయి. నిరుద్యోగులకు శుభవార్త వింటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఇంటిలో అందరూ సంతోషంగా గ‌డుపుతారు. దైవదర్శనాలు చేస్తారు. పనుల్లో కొంత జాప్యం ఏర్ప‌డుతుంది. ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తుతాయి. ఆకస్మికంగా పుణ్యక్షేత్రం సందర్శినానికి వెళ‌తారు.

ధనుస్సు రాశి….

ఆకస్మిక ధన, వస్తులాభాలు క‌లుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. ఆస్తిలాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్ప‌డుతుంది. పనులలో పురోగతి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. మహిళలకు వంటింట్లో జాగ్రత్త అవ‌స‌రం.

మకరరాశి..

కుటుంబంలో అనుకూలం వాతావ‌ర‌ణం ఏర్ప‌డి స‌ర‌దాగా గడుపుతారు. శత్రువులు మిత్రులుగా అవుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కష్టానికి త‌గ్గ ఫలితం కనిపించదు. పాత బాకీలు తీరుస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఓడిదుడుగులు త‌ప్ప‌వు.

కుంభరాశి..

ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. మీ పనులు, రోజువారీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తికి సంబంధించి కుటుంబ స‌భ్య‌లుతో వివాదాల పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

మీనరాశి..

నూతన కార్యక్రమాలు చేపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు పని భారం పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్ప‌డుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కృషి పెరుగుతుంది.

Related posts