telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 30(సోమవారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారంలో లాభం కనిపిస్తోంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.

వృషభం: ఉద్యోగంలో మీ ప్రతిభ బాగా వ్యక్తమవుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కొన్ని పనుల్లో శ్రమ వృథా అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.వృత్తి, వ్యాపారాలపరంగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తాయి.

మిథునం: అదృష్టయోగం ఉంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం: రోజంతా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రమతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది.

సింహం: సమయం అనుకూలంగా ఉంది. పదిమందికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి పొందడానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

కన్య: తలపెట్టిన ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారులకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన మరమత్తులు పూర్తి చేస్తారు.

తుల: ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంది. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలను శ్రద్ధగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. బంధువులతో మొహమాటాలకు పోవద్దు.

వృశ్చికం: ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు: ఉద్యోగులు ఓర్పు, పట్టుదలతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో బయటివారితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగుంటుంది.

మకరం: వృత్తి, వ్యాపారులుకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు.

కుంభం: ఉద్యోగుల్లో శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. తలపట్టిన పనులు నెరవేరతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం: ఉద్యోగులకు బాగుంటుంది. కాలం అనుకూలంగా ఉంది. ఆదాయం, ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్తుకు అవసరమైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. వృత్తి పనివారికి బాగుంటుంది.

Related posts