telugu navyamedia
క్రైమ్ వార్తలు

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..శివ‌పార్వ‌తి థియేటర్‌ పూర్తిగా దగ్ధం

హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్​బీలోని ఉన్న శివపార్వతి సినిమా థియేటర్ కాలి బూడిదైంది. ఆదివారం అర్థరాత్రి 2.20 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం ఈ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో థియేటర్ సామగ్రి పూర్తిగా కాలిపోయింది.

థియేటర్‌లో మంటలు చేల‌రేగ‌డం గమనించిన  సిబ్బంది ఫైర్ స్టేష‌న్‌కు కాల్ చేశారు.  వెంట‌నే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్న చేరుకొని 3 ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు . రాత్రి స‌మ‌యం కావ‌డంతో భారీ ప్ర‌మాదం తప్పింది. 

కాగా…షార్ట్ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద జ‌రిగిన సమయంలోఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు.. దాదాపు రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం థియేటర్‌లో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా నడుస్తుంది. ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా ముగిసిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తాళాలు వేశారు. ఆ తర్వాత శివపార్వతి థియేటర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి థియేటర్‌ స్ర్కీన్, కుర్చీలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts