telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇంట్లో దొంగలు పడ్డారంటూ పోలీసులకు ఫోన్… తీరా వచ్చాక…!?

Robot

నార్త్ కరోలినాలో నివాసముంటున్న థామస్ మియామి అనే వ్యక్తి తన భార్యతో కలిసి రాత్రి సమయంలో సినిమా చూస్తున్నాడు. సినిమా చూస్తుండగా… వారికి ఇంట్లో నుంచి ఏవో చప్పుళ్లు రావడం వినిపించాయి. తమ ఇంట్లో దొంగలు పడ్డారేమోననుకుని తలుపు లాక్ చేసుకుని ఇద్దరూ లోపలే దాక్కున్నారు. వెంటనే 911కు ఫోన్ చేసి తమ ఇంట్లో దొంగలు పడ్డారని వెంటనే రావాలని కోరారు. థామస్‌ మిలిటరీ శిక్షణ పొంది ఉండటంతో.. దొంగలు బెడ్‌రూం తలుపు తెరిస్తే తాను శిక్షణలో పొందిన టాలెంట్‌ను వాడాలని నిశ్చయించుకున్నాడు. ఫోన్ చేసిన నిమిషాల్లోనే పోలీసులు థామస్ ఇంటికి చేరుకున్నారు. ఇంటి లోపలకు వచ్చిన పోలీసులకు ఓ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ శబ్దం చేస్తూ ఇంటిని క్లీన్ చేస్తుండటం కనిపించింది. దీంతో.. తాము పట్టుకోడానికి వచ్చిన దొంగ ఓ వాక్యూమ్ క్లీనర్ అని పోలీసులు అర్థం చేసుకున్నారు. థామస్‌ను పిలిచి జరిగిన విషయం చెప్పగా.. ఒక్కసారిగా కంగుతిన్నాడు. వాక్యూమ్ దానంతట అదే ఆన్ అవ్వడం కారణంగా ఇలాంటి పొరపాటు జరిగిందంటూ పోలీసులకు క్షమాపణలు చెప్పాడు. ఏదేమైనప్పటికీ.. తాము ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే పోలీసులు రావడం పట్ల థామస్ ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Related posts